Monday, November 18, 2024

మా అక్క‌ది ముమ్మాటికీ హ‌త్యే..! ప్రీతి సోదరుడి సంచలన కామెంట్స్..

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ల ర్యాగింగ్ భరించలేక డాక్టర్ ప్రీతి ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. తాజాగా, ప్రీతి సోదరుడు పృథ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రిమాండ్ రిపోర్టులో అనేక అంశాలు మిస్సయ్యాయి అన్నారు. డాక్టర్ల సమక్షంలో కౌన్సెలింగ్ జరుగలేద‌ని, ఆ మరుసటి రోజే మా అక్క చనిపోయింది. మా అక్క మొబైల్‌లో చాటింగ్ కూడా డిలీట్ అయింది. చాట్ రిట్రీవ్ చేసి పూర్తి విషయాలు బయటపెట్టాలి. మా అక్క ప్ర‌తీది ముమ్మాటికీ హత్యే అనేందుకు తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి అని షాకింగ్ కామెంట్స్ చేశారు. మరి దీనిపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement