Sunday, November 17, 2024

మా నాన్న లారీ డ్రైవర్.. కార్మికుల కష్టాలు నాకు తెలుసు : ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

మా నాన్న లారీ డ్రైవర్,కార్మికుల కష్టాలు నాకు తెలుసు.. నాన్నతో లారీలో వెల్లేవాన్ని, కార్మికుల కష్టాలు నాడు నాన్నను చూసే తెలుసుకున్న అని, కార్మిక కుటుంబం నాది.. మీ కష్టాలు తీర్చుతా.. ఆటోనగర్ అభివృద్ది చేస్తా.. కార్మికుల బ్రతుకులు మార్చుతా అని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ ఆటోనగర్ లో కాకతీయ ఆటోయూనియన్ సర్వ సభ్య సమావేశానికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా భారీ ర్యాలీగా కార్మిక సంఘాల నాయకులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. 26 కార్మిక సంఘాల గౌరవ అధ్య‌క్షుడిగా ఎమ్మొల్యే నరేందర్ ను వారు నియమించుకున్నారు. ఈ సందర్బంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. మా నాన్న ఒక కార్మికుడే.. లారీ డ్రైవర్ గా ఎందరికో సహాయం చేసారు. ఆయన ఎంతో మందికి ఉపాధి కల్పించారు. ఆర్టీసీ యూనియన్ కు నేను గౌరవ అధ్య‌క్షుడిగా ఉన్నా.. ఆ యూనియన్ ఏ నాడు ఓడిపోలేదు. కార్మికుల బాగు కోసం కష్టపడటం నాకిష్టం.. కార్మికుల సమస్యల పట్ల నాకు అవగాహన ఉంది.. వాటిని పరిష్కరిస్తా.. ఆటోనగర్ కార్మిక యూనియన్ గౌరవ అధ్య‌క్షుడుగా నన్ను ఏర్పాటు చేస్కున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ మోటర్ ఫీల్డ్ ప్రత్యేకత సంతరించుకునేందుకు మనమంతా నడుంబిగించాలన్నారు. తెలంగాణలో ప్రతి పేద బిడ్డ ప్రతీ కార్మిక కుటుంబం బాగుండాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అన్నారు. దేశానికే తలమానికంగా 1100 కోట్లతో సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నాం.. ఆటోనగర్ లో ప్రజలు బాగుండాలని ఆలోచించే నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన ద్వారం ఆటోనగర్ నుండే ఉండబోతుంది. ఈ ప్రాంతానికి మరింత కల రాబోతుంది అన్నారు. వరంగల్ కు మెడికల్ కాలేజీ రాబోతుంది.. అద్బుతమైన రోడ్లు వేసాం.. ఆటోనగర్ లో 10 కోట్లతో సుందరమైన రోడ్డు వేసాం.. పేదల పిల్లల కోసం అద్బుతమైన వసతులతో గురుకులపాఠశాలలు ఏర్పాటు చేస్తామ‌న్నారు. నాపై నమ్మకం ఉంచండి. నా ప్రాణం అడ్డుపెట్టైనా మీకు సేవచేస్తా. మళ్ళి అదికారం టీఆర్ఎస్ దే అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement