Saturday, November 23, 2024

అపరిశుభ్రంగా మరుగు దొడ్లు..

గట్టమ్మ ఆలయం చుట్టూ చెత్తా చెదారం
కనీస సౌకర్యాలను జాకారం గ్రామ పంచాయతీ కల్పించడం లేదు
ఇబ్బందులకు గురవుతున్నా భక్తులు
ఆదివాసీ నాయకపోడ్ ములుగు జిల్లా అధ్యక్షులు కొత్త సురేందర్

ప్రభ న్యూస్ ప్రతినిధి, ములుగు : ములుగు జిల్లాలోని ములుగు మండలం గట్టమ్మ ఆలయం వద్ద ఉన్న మరుగు దొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని ఆదివాసీ నాయకపోడ్ ములుగు జిల్లా అధ్యక్షులు కొత్త సురేందర్ అన్నారు. ములుగు జిల్లా సమీపంలోని గట్టమ్మ ఆలయం వద్ద ఉన్న మరుగు దొడ్లను,పరిసరాలను జాకారం సర్పంచ్ దాసరి రమేష్,నాయకపోడ్ ములుగు జిల్లా అధ్యక్షులు కొత్త సురేందర్ లతో కలిసి ములుగు డీపీవో వెంకయ్య పరిశీలించారు. అనంతరం కొత్త సురేందర్ డీపీవో వెంకయ్య దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లారు. మరుగుదొడ్లు, మూత్రశాలలను చాలా రోజుల నుంచి శుభ్రతపరచడం లేదని, ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆలయ చుట్టూ ప‌క్కల పరిసరాలను శభ్ర పరచడం లేదని, ఎక్కడ చూసినా చెత్తా చెదారం కనిపిస్తుందని తెలిపారు. మరుగు దొడ్లను శుభ్రపరచక పోవడంతో వచ్చిన భక్తులు మరుగు దొడ్లలోకి వెళ్లకుండా భహిరంగ ప్రదేశాలలో మల విసర్జన చేస్తున్నారని అన్నారు. లక్షలకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టీ మరుగుదొడ్లను నిర్మిస్తే జాకారం గ్రామపంచాయతీ శుభ్ర పరచడం లేదని అన్నారు. మరుగుదొడ్ల ను శుభ్రం చేయకుండా నిర్లక్ష్యం చేస్తు భక్తులకు ఇబ్బందులు కలిగేలా చేస్తున్నారని మండిపడ్డారు. గట్టమ్మ దేవాలయానికి అనుకొని ఆరడుగుల దూరంలో ఉన్న కాళీస్థలంలో పెద్ద పెద్ద, రాళ్లు దుబ్బతో భక్తులు నడుస్తుంటే దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు . తక్షణమే సీసీ రోడ్డు నిర్మించి భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆయనను కోరారు ఈ కార్యక్రమంలో గట్టమ్మ ప్రధాన పూజారులు అరిగెల సాంబయ్య కొత్త సారయ్య అచ్చ రాజు ,గట్టమ్మ పూజారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement