వరంగల్ : గిఫ్ట్ వచ్చిందని ఆన్ లైన్ లో వినియోగదారులను నమ్మించి డబ్బులను దోచుకుంటూ మోసాలకు పాల్పడుతున్న 13మంది సభ్యుల ముఠాను టాస్క్ ఫోర్స్ .. ఇంతేజార్ గంజ్ పోలీసులు సంయుక్తంగా కలిసి వారిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన ముఠా సభ్యుల నుండి 14లక్షల 36వేల రూపాయలతో పాటు 15 సెల్ ఫోన్లు, స్క్రాచ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ప్రస్తుతం పరారీ వున్న నిందితులు: కలకత్తాకు చెందిన 1. ప్రజీత్, 2. సంజీవ్, 3 ప్రకాశ్. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ మోసపోయిన ఆన్ లైన్ లో వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదులపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇంతేజార్ గంజ్, స్టేషన్ ఘన్‌పూర్, జఫర్ గడ్, గీసుగొండ, ఖానాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులను నమోదు చేసుకోని వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి అదేశాల మేరకు సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డి.సి.పి పుష్పా అధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రస్తుతం వున్న ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోని నిందితుల కదలికలను గుర్తించి నిందితులు తిరిగి కొల్ కత్తాకి తిరిగి వెళ్ళే క్రమంలో వరంగల్ రైల్వేస్టేషన్ ప్రాంతంలో వున్నట్లుగా పోలీసులకు సమచారం అందడంతో స్థానిక టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఇంతేజా గంజ్ పోలీసులు సంయుక్తంగా కలిసి నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నిందితులు నేరాలను అంగీకరించారు. నేరాలను గుర్తించడంతో పాటు పెద్దమొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డి.సి.పి పుష్పా, టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఎ.సి.పి ప్రతాప్ కుమార్, ఇన్ స్పెక్టర్లు శ్రీనివాస్ జీ, మధు,ఇంతేజార్ గంజ్ ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లు, సైబర్ క్రైం ఇన్ స్పెక్టర్ జనార్ధన్ రెడ్డి, అసిస్టెంట్ ఆనాటికల్ అఫీసర్ సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుళ్ళు శ్యాం సుందర్, సోమయ్య,కానిస్టేబుళ్ళు అలీ, చిరంజీవి, శ్రీకాంత్, సృజన్, శ్రీనివాన్లను పోలీస్ కమిషనర్ అభినందించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement