Tuesday, November 26, 2024

పీజీ వైద్య సీట్ల భర్తీకి మాఫ్‌ఆప్‌ వెబ్‌ కౌన్సిలింగ్‌..

వరంగల్‌ ప్రభన్యూస్‌ , ప్రతినిధి : పీజీ వైద్య, దంత వైద్య కన్వీనర్‌ కోటా సీట్లకు వెబ్‌ కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. ఈ మేరకు హెల్త్‌ యూనివర్సిటీ గురువారం మాఫ్‌ ఆప్‌ విడత ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది . తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్ధులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే మొదటి, రెండవ విడతలలో ప్రవేశాలు పొందిన అభ్యర్దులు ఈ విడత కౌన్సిలింగ్‌కు అనర్హులు. సీట్ల ఖాళీల వివరాలను యూని వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరి చారు.

ఈనెల 24, 25వ తేదిల్లో ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ www.knruhs.telangana.gov.in లో చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement