Thursday, November 21, 2024

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న కల్వకుంట్ల కవిత

ప్రభన్యూస్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం సాయంత్రం కొండగట్టు అంజన్నను దర్శించుకొని హనుమాన్ చాలీసా కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు జగిత్యాల, మెట్‌పల్లిలో పర్యటించారు. దేశంలో నిరుద్యోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిందని, ఎన్నడూ లేనివిధంగా రూపాయి విలువ పతనమయిందని కవిత అన్నారు. మోదీ హయాంలో పెట్రోల్ నుంచి నిత్యావసర వస్తువులు ధరలు భారీగా పెరిగాయని విమ‌ర్శ‌లు చేశారు. జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లిలో జరిగిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీలు కవిత, ఎల్‌ రమణ, ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు పాల్గొన్నారు.

దేవుడి పేరుతో రాజకీయం చేస్తే భయపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ క‌విత అన్నారు. వాళ్లు జై శ్రీరాం అంటే మనం జై హనుమాన్‌ అనాలని చెప్పారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు. తెలంగాణ తెచ్చుకున్నది యువత కోసమని, 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేశామని వెల్లడించారు. స్థానికతకు సంబంధించిన జీవో రెండేండ్ల పాటు కేంద్రం పెండింగ్‌లో పెట్టినా ఓపిక పట్టామని చెప్పారు. యువత ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం కావాలని సూచించారు. గతంలో 7 వేల మంది బీసీ విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వ హాస్టల్ సౌకర్యం ఉండేదని, ప్రస్తుతం 281 బీసీ హాస్టళ్లను ఏర్పాటు చేశామని కవిత అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement