Thursday, November 21, 2024

కవలలకు కేసీఆర్ కిట్ అందించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

తిమ్మంపేట గ్రామానికి చెందిన బొంత సారయ్య-కొమరమ్మలకు “లలిత-రమ” అనే ఇద్దరు కవల పిల్లలకు గత ఏడాది క్రితం ఒకే వేదికగా వివాహం జరిగి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే లబ్ది పొందిన కళ్యాణలక్ష్మీ చెక్కులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ఒకేసారి చెక్కులను ఇరువురి కవలలకు అందజేశారు. నిన్నటి రోజున నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ ఇద్దరి కవలలు ఒకేరోజు ప్రసవించి మగ పిల్లలకు జన్మనిచ్చారు. ఈరోజు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించి, కేసీఆర్ కిట్ ను ఇరువురికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు గ్రామ సర్పంచ్ మోడెం సాగర్, పట్టణ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement