Friday, November 22, 2024

రంజాన్ వేడుకల్లో ఎమ్మెల్యే పెద్ది

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని “ఈద్గా” వద్ద ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులకు “ఈద్ ముబారక్” తెలిపారు. ముస్లిం సోదరులందరు రంజాన్ మాసాన్ని పవిత్రంగా జరుపుకోవడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ ను కేటాయించిందన్నారు. ముస్లింల సంక్షేమం కోసం నర్సంపేట పట్టణంలో రూ. 75 లక్షల నిధులతో ముస్లిం కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం మంజూరు చేస్తానని ప్రకటించారు. నియోజకవర్గంలోని ముస్లిం మైనారిటీ సోదరులు విద్య, వైద్యo, ఉపాధి కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు నిత్యం అందుబాటులో ఉండి ప్రజలకు సేవాలందిస్తానని తెలియజేశారు. ఈ పవిత్రమైన పర్వదినాన ఆ ‘అల్లా’ దేవుని దీవెనలు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని, ప్రజలందరూ శాంతి సమాధానాలతో, సుఖ-సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాని ఎమ్మెల్యే పెద్ది చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement