వరంగల్: వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు సమీపంలోని కళ్యాణ లక్ష్మి ఫంక్షన్ హాల్లో శనివారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల స్థాయి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ హాజరైనారు. ఈ కార్యక్రమానికి నియోజక వర్గ స్థాయిలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు. అన్నా అంటే, ఆపద ఉందంటే నేనున్నా అంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవకునిలా ఆదుకుంటున్న నాయకులు ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్న అంటూ పలువురు వారిని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో పోటీ లేకుండా, గెలుపొందే నాయకుడు కేవలం అరూరి మాత్రమేనని పలువురు చర్చిస్తున్నారు.