Tuesday, November 19, 2024

TS | ఏజెన్సీలో మావోయిస్టు కరపత్రాల కలకలం..

వాజేడు, ప్రభ న్యూస్ : ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని జగన్నాపురం జంక్షన్ వద్ద జాతీయ రహదారి పక్కన తెలంగాణ రాష్ట్ర కమిటీ సీపీఐ మావోయిస్టు పేరున కరపత్రాలు వెలువడడంతో వాజేడు మండలంలో భయానక వాతావరణం ఏర్పడింది. ఆ కరపత్రంలో ఈ విధంగా పొందుపరిచారు. తెలంగాణ రాష్ట్రంలో ధరణి పోర్టల్ ద్వారా భూమి సమస్యలతో రైతాంగం దివాలు తీస్తున్నారు.. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ విప్లవం జరగకుండా రైతాంగం ఈ సమస్యల నుండి బయటపడడం సాధ్యం కాద‌న్నారు.

గత నాలుగు దశాబ్దాలుగా రాష్ట్రంలో వ్యవసాయ విప్లవం జరిగి భూస్వాముల పెట్టుబడిదారుల పునాదులు కదిలిపోగా వీటిని మళ్లీ పునరుద్ధరించడానికి పోలీసు వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో దెబ్బతిన్న బడా భూస్వాముల అధికార స్థాపనలో పోలీసుల సహకారంతో పాత కొత్త భూస్వాముల, కాంట్రాక్టర్ల వర్గం ఒక వ్యవస్థగా ఏర్పడి ప్రజలకు అన్ని రకాలుగా పీడిస్తున్నారు. ఈ దోపిడీ ముఠా గ్రామీణ ప్రాంతాల్లో సామ్రాజ్యవాదుల‌ను అణిచివేస్తుంది.

ఈ ముఠాను దెబ్బతీసి గ్రామాల్లో రైతాంగ అధికారాన్ని నిలబెట్టడానికి వర్గ పోరాటాలు తీవ్రతరం చేయాలి రైతాంగ ప్రజలారా పోరాడకుండా సమస్యలు పరిష్కారం కావు పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని కరపత్రంలో పొందుపరిచారు. ఒకవైపు పోలీసులు ప్రతిరోజు ఎక్కడకక్కడ తనిఖీలు చేపడుతుండడం, మావోయిస్టు తమ ఉనికిని చాటుకోవడం కోసం ప్రయత్నిస్తూ వాజేడు పోలీస్ స్టేషన్ కు అతి సమీపంలో ఉన్నటువంటి జగన్నాథపురం జంక్షన్ వద్ద మావోయిస్టు కరపత్రాలు వెలువడటంతో ఏజెన్సీ ప్రాంతంలో అలజడి మొదలైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement