Saturday, November 23, 2024

తప్పిపోయిన కూతురిని తల్లికి అప్పగింత

లక్నోకు చెందిన అష్రఫ్ అలీ అనే వ్యక్తి తన కూతురు తప్పిపోయిందన్న విషయంలో లక్నోలోని బజారుకాల పీఎస్ లో దరఖాస్తు చేసినారు. వరంగల్ లో ఉందన్న సమాచారం మేరకు వారు కూతురు ఫోటోతో హనుమకొండ పోలీసులను ఆశ్రయించగా వెంటనే స్పందించిన పోలీసులు హనుమకొండ పరిధిలో ఉన్న బ్యూటీ పార్లర్, మగ్గం పని చేసే వ్యక్తుల వద్ద వెతకగా ఆమె ఆచూకీ లభించింది. అమ్మాయిని సంబంధిత లక్నో పోలీసులు తల్లిదండ్రులకు అప్ప‌గించారు. దీనిలో కృషి చేసిన ఎస్ హెచ్ఓ హనుమకొండ శ్రీనివాస్, కానిస్టేబుల్ రవిని ఏసిపి హనుమకొండ కిరణ్ కుమార్ అభినందించినారు. తదుపరి ఎంతో దూరము నుండి వచ్చిన తమను ఆదుకొని తమ కూతురును తమకు అప్పగించడంలో సహకరించిన హనుమకొండ పోలీసులకు అష్రఫ్అలీ దంపతులు కృతజ్ఞతలు తెలిపినారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement