Thursday, November 14, 2024

ప్రాణహిత పుష్కరాల్లో పాల్గొన్న‌ మంత్రి సత్యవతి, ఎమ్మెల్యే గండ్ర దంపతులు

భూపాలపల్లి/మహాదేవపూర్ (ప్రభ న్యూస్): పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ప్రాణహిత పుష్కరాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాలేశ్వరంలోని త్రివేణి సంగమంలో గత తొమ్మిది రోజులుగా వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం తెలంగాణ రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి ఆయ‌న‌ సతీమణి, వరంగల్ రూరల్ జడ్పీ ఛైర్మన్ గండ్ర జ్యోతి దంపతులు కాళేశ్వర క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ముందుగా కాళేశ్వరంలోని విఐపి పుష్కర ఘాట్ చేరుకొని త్రివేణి సంగమంలో చీరె, సారె, పసుపు, కుంకుమ, పూలు, గాజులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పుష్కర పుణ్య స్నానాలు ఆచరించారు. అక్కడి నుండి కాలేశ్వర క్షేత్రానికి చేరుకోగా ఆలయం అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి ముక్తేశ్వరునికి, శుభనంద అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి శేష వస్త్రాలు తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా, అదనపు కలెక్టర్ దివాకర, జడ్పీ సీఈవో శోభారాణి, డిఎస్పి బోనాల కిషన్, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ వెంకట రాణి సిద్దు,టిఆర్ఎస్ పార్టీ వివిధ మండలాల అధ్యక్షులు, పిఎసిఎస్ చైర్మన్ లు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement