భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మంగళవారం భూపాలపల్లి మండలం కమలాపూర్ ఆముదాలపల్లి మార్గమధ్యలో ఉన్న వందల ఏళ్ల చరిత్ర కలిగిన సీతారాముల (టేకు) చెట్లను సందర్శించారు. వాటిని చూసి చాలా అబ్బురపడ్డారు. కాసేపు సరదాగా చెట్ల వద్ద సేదతీరారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, జిల్లా కలెక్టర్ భావేశ్ మిశ్రా, అదనపు కలెక్టర్ దివాకర్ తో కలిసి చెట్టు వైశాల్యాన్ని చేతులతో కొలిచారు. అనంతరం గ్రామస్థులతో ఈ రెండు టేకు చెట్ల చరిత్ర అడిగి తెలుసుకున్నారు. ఈ చెట్ల ఉన్న ప్రదేశం ఫారెస్ట్ కు సంబంధించినదా లేక అసైన్డ్ భూమినా అని కలెక్టర్ ను ఆరా తీశారు. ఈ ప్రాంతానికి రోడ్డు ఏర్పాటు చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సూచించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement