వరంగల్: వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలలో టిఆర్ ఎస్ అభ్యర్ధులకు మద్దతుగా మంత్రి సత్యవతి రాథోడ్ ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు… పరకాల నియోజకవర్గ పరిధిలోని 16వ డివిజన్, గరీబ్ నగర్, జాన్ పాక, ఆదర్శ నగర్ లలో టిఆర్ఎస్ పార్టీ అభర్ధి మనీషా కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి ప్రచారాన్ని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, స్థానిక నేతలతో కలసి సత్యవతి రాథోడ్ ప్రచారాన్ని నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్నికలు రాగానే కొన్ని పార్టీలు పెద్దపెద్ద మాటలు చెబుతాయని, తర్వాత చేసేది శూన్యమని విమర్శించారు. కానీ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటమేరకు అభివృద్ధి చేసి చూపిస్తారని వెల్లడించారు. వరంగల్‌లో పర్యటించిన సీఎం క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసి ఏంచేస్తే బాగుంటుందని ఆలోచించి బడ్జెట్‌లో కార్పొరేషన్‌కు ప్రత్యేకంగా రూ.250 కోట్లు కేటాయించారని చెప్పారు.రాష్ట్రంలో చెరువు శిఖంలో పట్టాలు ఎక్కడా ఇవ్వలేదని, గరీబ్ నగర్‌లో మాత్రమే ఇచ్చారని, త్వరలో డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌కు పేదల కష్టాలు తెలుసునని, అందుకే వారికి ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. గతంలో పెన్షన్ అందుకుంటున్న వ్యక్తి చనిపోయిన తర్వాతే కొత్తవారికి పెన్షన్ ఇచ్చేవారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలేదని, అర్హులందరికీ రూ.2 వేలు ఇస్తున్నారని తెలిపారు. త్వరలో లబ్ధిదారుల వయస్సును 57 ఏండ్లకు తగ్గిస్తామన్నారు. బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు.
ఆరోగ్యలక్ష్మి పథకం కింద గర్భిణిలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని చెప్పారు. కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్ష 116 ఇస్తున్నామన్నారు. ఇలాంటి పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అందువల్ల పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
16వ డివిజన్ లో మంత్రి సత్యవతి, ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటింటి ప్రచారం…
Advertisement
తాజా వార్తలు
Advertisement