ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి: /గణపురం (ప్రభ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండల కేంద్రంలో రూ.1కోటి 20లక్షలతో నూతనంగా నిర్మించిన తహసిల్దార్ కార్యాలయాన్ని గురువారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు విద్యుత్ శాఖ మంత్రి జి జగదీశ్వర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గండ్ర జ్యోతి, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బస్వరాజు సారయ్య, టీబీజీకేస్ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, అదనపు కలెక్టర్ దివాకర, జాయింట్ కలెక్టర్ స్వర్ణలత, రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ కేతిరి వాసుదేవరెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్, కాటారం పిఏసీఎస్ చైర్మన్ లు చల్ల నారాయణరెడ్డి, పొరెడ్డి పూర్ణ చంద్ర రెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు, భూపాలపల్లి ఆర్డీవో శ్రీనివాస్, తహసిల్దార్ సాయిని సతీష్ కుమార్ ఎంపీడీవో డాక్టర్ లెక్కల అరుంధతి, బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పొలసాని లక్ష్మీ నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.