Monday, November 18, 2024

దళిత విద్యార్థుల కోసం ప్రత్యేక చట్టం..ఎర్రబెల్లి..

వ‌రంగ‌ల్ : హ‌న్మ‌కొండ లోని అంబేద్క‌ర్ చౌర‌స్తాలో రాజ్యాంగ ర‌చ‌యిత అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పూల మాల వేసి, పుష్పాంజ‌లి ఘ‌టించారు ‌రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర రావు.ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్య‌మంత్రి, ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రి, ఎమ్మెల్యేలు చ‌ల్లా ధర్మారెడ్డి, న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రారంభించిన అంబేద్కర్ చౌరస్తా పార్క్ ని మంత్రి ఎర్రబెల్లి, కడియం, ఎమ్మెల్యేలు పరిశీలించారు. పార్క్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగం పుస్తక ప్రతిమను పరిశీలించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ సీఎం కెసిఆర్ ప్ర‌భుత్వం అంబేద్క‌ర్ స్ఫూర్తిగా…ద‌ళితుల అభివృద్ధి కోసం ప్ర‌త్యేక చ‌ట్టం ద్వారా ఎస్సీ, ఎస్టీ స‌బ్ ప్లాన్ ను ఏర్పాటు చేసిందన్నారు.ద‌ళిత విద్యార్థుల కోసం ప్ర‌త్యేక గురుకులాలు ఏర్పాటు చేసి, నాన్య‌మైన విద్య‌నందిస్తున్నామని చెప్పారు. అంబేద్క‌ర్ విదేశీ విద్యానిధి ద్వారా విదేశాల్లో చ‌దువుకునే వాళ్ళ కోసం ఒక్కొక్క‌రికి 20 ల‌క్ష‌ల స‌హాయం చేస్తోంది టిఆర్ ఎస్ ప్రభుత్వం అని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement