జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం చిన్నమడూరు, రాంభోజీ గూడెం గ్రామాలకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. అలాగే, దేవరుప్పుల మండలం రాంభోజీ గూడెం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మేడ ఎల్లేశ్, మేడ మానస, మేడ అయిలయ్య, మేడ భాస్కర్, మేడ ఉప్పలయ్య, మేడ నర్సంయ్య, మేడ అరుణశ్రీ, మేడ ఎల్లయ్య తదితరులు టీఆర్ఎస్ లో చేరారు. హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఇంటి పార్టీ అన్నారు. దేశంలోనే టీఆర్ఎస్ లాంటి పార్టీ లేదన్నారు. పార్టీ ప్రతి కార్యకర్తకు పార్టీ సొంతంగా బీమా చేసి, ఏ కారణం చేత కార్యకర్త మరణించినా, 2 లక్షల రూపాయల బీమా అందచేస్తున్న ఏకైక పార్టీ అన్నారు. కంటికి రెప్పలాగా కార్యకర్తలను కాపాడుకునే గొప్ప నాయకత్వం ఉన్న పార్టీ టీఆర్ ఎస్ అని మంత్రి వివరించారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి సముచిత గౌరవం గుర్తింపు లభిస్తుందన్నారు.
టీఆర్ఎస్ లో చేరిన వారిలో దేవరుప్పుల మండలం చిన్న మడూరు గ్రామ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు, కార్యకర్తలు చింతా యాదయ్య, మేడ అంజయ్య, గజ్జెట మల్లయ్య, చింతల రవి, మేడ నరేశ్, మల్లెపాక భాస్కర్, నాంపల్లి నారాయణ, మల్లెపాక నర్సయ్య, పడిగం నర్సయ్య, గజ్జెల ఆంజనేయులు, గజ్జెల మహేందర్, ఇంద్రాల సాయిమల్లయ్య, చిప్పల కిశోర్, మేడ మధు, చింత రాము, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈరెంటి విజయ్, కోట నర్సయ్య, కోట రేణుక, శాగ రేణుక, ఇంద్రాల శారద, గంథమల్ల లక్ష్మీ, పానిగంటి నర్సయ్య, గంథమల్ల అబ్బయ్య, మేడ ముత్తయ్య, రాపాక అంజయ్య, రాపాక నరేశ్, రాపాక ఉప్పలయ్య, రాపాక యాకమ్మ, రాపాక చిన్న ఎల్లయ్య, రాపాక దుర్గా ప్రసాద్, బాషపాక ఉప్పలయ్య, భాషపాక ఎల్లయ్య, మహంకాళి ప్రవీణ్, చిప్పల కుమార్, చింతా నర్సింహులు, చింతా రాము తదితరులు ఉన్నారు.
వీరు దేవరుప్పుల టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్, జెడ్పీటీసీ పల్లా భార్గవి సుందర్ రామిరెడ్డి, చామల విక్రమ్ రెడ్డి, చిన్న మడూరు సర్పంచ్ వంగా పద్మ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ గొడుగు సుజాత మల్లికార్జున్, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు జనగాం సంతోశ్, వంగా అర్జున్, మేడ సోమనర్సయ్య, మసిగంటపుల కృష్ణమూర్తి, మహంకాళి నారాయణ, మహంకాళి మధు, అలాగే రాంభోజీగూడెంకు చెందిన టిఆర్ఎస్ నేతలు పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చెంచు మల్లారెడ్డి, సర్పంచ్ సింగిరెడ్డి సరిత సతీశ్, ఉప సర్పంచ్ గొడుగు భాగ్యలక్ష్మి వేణు, రాంపెల్లి శ్రీశైలం, మొలుగూరు సంతోశ్, ధరావత్ నరేశ్
తదితర నాయకుల ఆధ్వర్యంలో వీరంతా టిఆర్ఎస్ లో చేరారు.