Saturday, September 7, 2024

WGL: వాగులో కొట్టుకుపోయిన మినీ వాహ‌నం..

కాటారం (ప్రభ న్యూస్) : జయశంకర్ జిల్లా కాటారం మండలంలోని దామరకుంట గుండ్రాత్ పల్లి గ్రామాల మధ్యనున్న అలుగు వాగులో ప్రవాహానికి శుక్రవారం ఓ మినీ వాహనం కొట్టుకుపోగా డ్రైవర్ సురక్షితంగా బయటకు వచ్చాడు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అలుగు వాగు భారీ వర్షం నీటితో వాగు ప్రవహిస్తుంది.

దీనిని గమనించని వాహన డ్రైవర్ దామరకుంట నుంచి అన్నారం వెళ్తూ వాగు దాటే క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వాగు ఉధృతి పెరగడంతో వాహనం నీటిలో కొట్టుకుపోగా డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి ట్రాలీపైకి ఎక్కి ఆర్ధనాదాలు పెట్టడంతో స్థానిక ప్రజలు గమనించి తాళ్ల సహాయంతో డ్రైవర్ ను కాపాడారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement