Friday, November 22, 2024

27న పాలకుర్తి లో దివ్యాంగులకు ప్రత్యేక వైద్య‌ శిబిరం

దివ్యాంగులకు బ్యాటరి తో నడిచే ట్రై సైకిల్, కాలిపర్స్, కృత్రిమ కాళ్ళు.
మంత్రి ఎర్రబెల్లి చొరవతో రాష్ట్ర వికలాంగుల సంస్థ అధ్వర్యంలో పరీక్షలు.
సద్వినియోగం చేసుకోవాలని వికలాంగులకు మంత్రి ఎర్రబెల్లి పిలుపు.

జనగామ. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చొరవతో, తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 27 న పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో దివ్యాంగులకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నిపుణుల సహకారంతో శారీరక దివ్యాంగులకు అవసరమగు బ్యాటరి తో నడిచే ట్రై సైకిల్, కాలిపర్స్, కృత్రిమ కాళ్ళు అందచేయడానికి వీలుగా అవసరమైన పరీక్షలు ఈ నెల 27వ తేదీన పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్యాంప్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు జరుగనుంది అని తెలిపారు. శిబిరంలో వికలాంగులు పరీక్షలు చేయించుకొని, శిబిరాన్ని విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి వికలాంగులకు పిలుపు నిచ్చారు అని తెలిపారు. ఈ శిబిరానికి నిర్ణీత వికలాంగ వ్యక్తులు మాత్రమే హాజరు కావాలని నిర్వాహకులు తెలిపారు. బ్యాటరీ ట్రై సైకిల్…..శారీరక దివ్యాంగులు కాళ్ళలో తీవ్రమైన వైకల్యం కలిగి ఉండి రెండు చేతులు మంచి స్థితిలో ఉండి, వాహనం నడిపగలిగిన వాళ్లు వైకల్య శాతం 80 శాతం ఆ పై ఉన్న 16 ఏళ్ల పైబడి ఉన్న వాళ్ళు కుటుంబ నెలసరి ఆదాయం రూ.15 వేలకు మించకుండా అ అని తెలిపారు. గతంలో తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ తరఫున మోటోరైజేడ్ వాహనం పొందిన వారు బ్యాటరీ ట్రై సైకిల్ పొందుటకు అనర్హులు అని అన్నారు. కాలిపర్స్….శారీరక దివ్యాంగులు కాళ్ళు పోలియో, పక్షవాతము కలిగిన వారు అర్హులు అని, ఈ శిబిరములో కొలతలు మత్రమే తీసుకుంటారు అని తెలిపారు.కృత్రిమ అవయవాలు….కాళ్ళు తొలగించబడిన వారు కృత్రిమ కాళ్ళు అమర్చుటకు అని, ఈ శిబిరములో కొలతలు మత్రమే తీసుకొనీ తదుపరి వాటిని తయారు చేసి అమర్చుటకు మరొక శిభిరము ఏర్పాటు చేసి తెలియ చేస్తారని చెప్పారు. ఈ శిభిరానికి హాజరగు అభ్యర్థులు తమ ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, వైకల్య ధృవీకరణ పత్రం 3 పాస్ పోర్ట్ సైజు ఫోటోలు తప్పక తీసుకు రావాలని నిర్వాహకులు తెలిపారు. సూచించిన అర్హతలు, వైకల్యం గల వారు మత్రమే హాజరు కావాలని, అర్హత లేని దివ్యాంగులు, ఇతర కేటగిరి దివ్యాంగులు శిభిరానికి రావద్దని, వచ్చి ఇబ్బంది పడవద్దని నిర్వాహకులు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement