మే డేను పురస్కరించుకుని ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు మే డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. భూపాలపల్లి పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అన్ని గనుల వద్ద, కాలనీలో మేడే సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి పతాకాలను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి మోటపలుకుల రమేష్ మాట్లాడుతూ కార్మిక హక్కులకై చికాగో నగరంలో లక్షలాదిమంది కార్మికులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్న వారి పైన పెట్టుబడిదారీ వర్గం కాల్పులు చేపట్టడంతో కార్మికుల రక్తంతో తడిసిన జెండా ఎర్ర జెండా అని అన్నారు. కార్మికులు పోరాటాల ద్వారానే హక్కును సాధించుకున్నారు. ఆ హక్కులను కాపాడుకోవాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement