చత్తీస్ గడ్ లో మావోల ఘాతుకం
ఎస్ఐ మురళి హత్య
వాజేడు – తెలంగాణ – చత్తీస్ ఘడ్ సరిహద్దులలోని బీజాపూర్ జిల్లా గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలనార్ వద్ద మూడు రోజుల క్రితం కిడ్నాప్ కు గురైన గంగులూరు ఎస్ ఐ తాటీ మురళిని మావోయిస్ట్ లు హతం చేశారు…అతడి మృతదేహాన్ని పుల్సుమ్ పారా వద్ద రోడ్డుపై పడేశారు.. మృత దేహం వద్ద పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీ పేరుతో లేఖ ను ఉంచారు.. ఆ లేఖలో ఎస్ ఐ మురళి 2006 నుంచి సల్వా జుడుంలో పని చేశాడని అనంతరం 2021లో పోలీసు శాఖలో చేరాడని వివరించారు…సలాం జుడుంలో ఉన్న సమయంలోనూ, ఎస్ ఐ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోనూ మురళి ఛత్తీస్ ఘడ్ లోని పలు ఆదివాసీ గ్రామాలలో అమాయక పలు ఆదివాసీ గిరిజనులను హత్య చేశాడని, అలాగే మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డాడని పేర్కొన్నారు.. ఈ విషయంలో అతడికి పలుమార్లు హెచ్చరికలు కూడా చేశామని,అయిన అతని ప్రవర్తన మార్చుకోదన్నారు.. దీంతో బీజాపూర్ జిల్లాలోని పల్నూర్ గ్రామంలో అతడిని బుధవారం కిడ్నాప్ చేశామన్నారు.. అతడిపై వచ్చిన అభియోగాలపై గురువారం నాడు ప్రజాకోర్టు నిర్వహించామని, అవన్ని నిజమని తేలడంతో మరణ శిక్ష విధించామని వెల్లడించారు..శిక్ష అమలులో భాగంగా అతడిని కాల్చి చంపినట్లు వివరించారు..
ప్రజాకోర్టులో ఎస్ ఐ మురళికి మావోల మరణ శిక్ష..
Advertisement
తాజా వార్తలు
Advertisement