Tuesday, November 19, 2024

TS : ఏజెన్సీలో మావోయిస్టు కరపత్రాలు కలకలం

వాజేడు, మార్చి 8(ప్రభ న్యూస్): ములుగు జిల్లా లోని వాజేడు మండల పరిధిలో గల మురుమూరు కాలనీ ప్రగల్లపల్లి గ్రామ రహదారిపై సిపిఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరిట కరపత్రాలు శుక్రవారం వెలిశాయి. ఆ కరపత్రాలలో 114వ వార్షికోత్సవాన్ని విప్లవ ఉత్సవంతో జరుపుకుందాం మణిపూర్ కోకి ఆదివాసి మహిళపై జరిగిన అమానవీయ అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడుదాం కార్పొరేటీకరణకు సైన్ కి కరణకు బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజంకు వ్యతిరేకంగా విశాల మహిళా పోరాటాలను నిర్మిద్దాం పీడిత వర్గాల జాతుల కులాల మతాల మహిళా మనుగడను శాసిస్తున్న మనువాద భావజాలానికి వ్యతిరేకంగా పోరాడుదాం అంటూ కరపత్రాలలో పొందుపరిచారు.

మురుమూరు కాలనీ రహదారిపై వెలిసిన కరపత్రాల కింద కరెంటు వైర్ తో కూడిన టార్చ్ లైట్ ను అమర్చారు. దానిని చూసిన గ్రామస్తులు బాంబు అమర్చి ఉంటారని భయభ్రాంతులకు గురయ్యారు దానిని నిర్వీర్యం చేయడానికి వెంకటాపురం సిఐ బండారు రవికుమార్ నేతృత్వంలో బాంబు స్కాడును రప్పించి పరిశీలించగా ఎలాంటి బాంబు లేదని కేవలం వైరు మాత్రమే పెట్టారని కేవలం ప్రజలను భయపెట్టడం కోసమే మావోయిస్టు ఇంతటి ఘాతుకానికి ప్రయత్నించారని వెంకటాపురం సిఐ బండారు కుమార్ తెలిపారు. వాజేడు ఎస్సై వెంకటేశ్వర్లు మావోయిస్టులు వేసిన కరపత్రాలను కరెంటు వైర్ ను స్వాధీనం చేసుకున్నారు . వీరితోపాటు ఎస్సై కొప్పుల తిరుపతి పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కరపత్రాలు వెలవడంతో ఏజెన్సీ ప్రాంతంలో అలజడి మొదలైంది. ఒకవైపు పోలీసులు గత వారం రోజులుగా తనిఖీలు చేపట్టడం మరోవైపు మావోయిస్టులు కరపత్రాలు విడుదల చేయడంతో ఏజెన్సీ ప్రాంతంలో ఏం జరుగుతుందోనని ఇక్కడి ప్రజలు భ్రయోదయాలకు గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement