మావోయిస్టు జ్యోతక్క లొంగుబాటలో ఉన్నట్లు సమాచారం. మావోయిస్టు పార్టీలో మరో సీనియర్ నాయకురాలు అనారోగ్యంత బాధపడుతున్నారు. మూడు దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్న జ్యోతక్క ఉమ్మడివరంగల్ జిల్లాకు చెందినవారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో టైలరింగ్ టీమ్‌లో సభ్యురాలిగా ఉన్న షేక్ ఇమాంబిఅలియాస్ రాధక్క అలియాస్ జ్యోతక్క, అలియాస్ సాంబలక్ష్మీతో చెలమణి అవుతుంది.
54 ఏళ్ల వయసు ఉన్న జ్యోతక్క వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుధరావుపేటనివాసి. 30 ఏళ్ల క్రితం అడవి బాట పట్టిన జ్యోతక్క పార్టీకార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ప్రస్తుతం ఆమెను అరోగ్య సమస్యలు వెంటాడుతున్నందున ఆమె జనజీవనస్రవంతిలో కలిసేందుకు నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. తీవ్రమైన ఆనారోగ్యంతో ఉన్న జ్యోతక్క అలియాస్ ఇమాంబీ దండకారణ్య అటవీ ప్రాంతం నుండి స్వస్థలానికి రావాలని భావిస్తున్నట్టుగా విశ్వసనీయంగా వర్గాలు వెల్లడించాయి.