Tuesday, November 26, 2024

మహోగ్ర గోదావరి.. కాళేశ్వరంలో హై అలర్ట్‌ ప్రకటించిన అధికారులు..

ఉమ్మడి వరంగల్‌ , ప్రభన్యూస్‌ బ్యూరో: గోదావరి తల్లి మహోగ్రరూపం దాల్చింది… గోదావరి పరివాహక ప్రాంతాలను వరదలతో ముంచెత్తుతోంది.. అందినంత వరకు వరదలతో తుడిపెట్టేస్తోంది…ఊళ్లకు ఊళ్లనే వరదలతో ముంచేసింది…యాభై ఏళ్ల రికార్డులను తిరిగి రాసే విధంగా గోదావరి వరదలు వస్తున్నాయి.. గోదావరి ఎటు చూసినా కనుచూపు మేరలో వరద నీళ్లే దర్శనమిస్తున్నాయి.. గ్రామాలకు గ్రామాలే ఊళ్లను ఖాళీ చేసి బతుజీవుడా అంటూ అరచేతిలో ప్రాణాలను పెట్టుకొని భార్యబిడ్డలతో కుటుంబ సమేతంగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లుతున్న హృదయ విధారకరమైన దృశ్యాలు అందరిని కలచివేస్తున్నాయి.. జయశంకర్‌ భూపాలపల్లి నుంచి మొదలుకొని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం వరకు సుమారు 250 కిలోమీటర్ల పొడవునా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి

మేడిగడ్డ వద్దనే ఉన్నటువంటి పలిమెల పోలీస్టేషన్‌ పూర్తిగా నీట మునిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు కంట్రోల్‌ రూం కూడా పూర్తిగా నీటమునిగిపోవడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కాళేశ్వరం గ్రామం పూర్తిగా నీటమునిగిపోయింది. రెండవ అంతస్తులు ఉన్నటువంటి భవనాలు మాత్రమే పై అంతస్తులు కనిపిస్తున్నాయి. పెంకుటిల్లులు, ఒక అంతస్తు భవనాలుపూర్తిగా నీటిలోనే మునిగిపోయాయి. మహదేవ్‌పూర్‌, కాటారం, పలమెల మండలాలలో అన్ని ప్రజలు మూట, ముళ్లెలు సర్దుకొని పోయే హృదయ విధాకరమైన దృశ్యాలే కనిపిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement