మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గాజుల గట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి (గతంలో పనిచేసిన మాధవి) గ్రామ పంచాయతీలో అవినీతి అక్రమాలు పాల్పడ్డందుకు, ఎటువంటి పనులు చేయకుండా పని చేసినట్టు ఎంబీలు రికార్డు చేసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెన్షన్ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. గతంలో గ్రామ పంచాయతీలో అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున స్థానిక పంచాయతీ వార్డు మెంబర్లు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది. అందులో భాగంగా విచారణ చేసిన అధికారులు వారి పైన సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిసింది. ఇట్టి విషయమై ఎంపీఓను వివరణ కోరగా సస్పెన్షన్ వాస్తవమైనది అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement