వరంగల్: అభ్యుదయ సేవా సమితి, గర్ల్స్ అడ్వకసీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో స్థానిక పోలీసు అధికారుల సమక్షంలో బాల్యవివాహాల నిర్మూలన పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ… బాల్య వివాహాలు బాలికల ఆరోగ్యం పోషణ విద్య, ప్రాథమిక హక్కులు కోల్పోవడమే కాకుండా హింస దోపిడీకి గురవుతున్నారన్నారు. చిన్న వయసులో తల్లిగా మారితే పుట్టిన బిడ్డకు, తల్లికి ప్రమాదాలు ఎదురవుతాయని, ముఖ్యంగా బాల్య వివాహాలు, కొన్నిసార్లు అక్రమ రవాణాకు దారితీసే బాలికలను లైంగిక దోపిడీకి తీసుకుపోయి బలవంతంగా వారిచేత లైంగిక వ్యాపారం చేస్తున్నారని, తల్లిదండ్రులు పేదరికాన్ని అడ్డుగా పెట్టుకుని బాలికల విలువైన జీవితాన్ని బాల్యవివాహాలు చేయకూడదని ఈ సందర్భంగా సూచించారు. అలాగే బాల్య వివాహాలు చేయకుండా వారికి మంచి విద్యావకాశాలు కల్పించినట్లయితే వారు సామర్థ్యంతో ఎదిగి మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారన్నారు. తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సంక్షేమ హాస్టళ్లలో పేద వర్గాలకు చెందిన బాలబాలికలు తల్లిదండ్రులు అవకాశాలను అందిపుచ్చుకొని బాలికల ఎదుగుదలకు వెన్నుదన్నుగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారి అనిల్, సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ మండల పరశురాములు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement