వాజేడు : ములుగు జిల్లా వాజేడు మండలం పరిధిలోని గోదావరి ముంపు ప్రాంతమైన చండుపట్ల గ్రామానికి చెందిన 50 కుటుంబాల దళితులు ఎర్రబోరు ఫారెస్ట్ స్థలంలో సోమవారం నివాసం ఏర్పరచుకోవడం కోసం గుడిసెలు వేశారు. అది తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకొని దళితులు వేసినటువంటి గుడిసెలను తొలగించే ప్రయత్నం చేయగా ఫారెస్ట్ అధికారులకు దళితుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇటీవల వరదలు సంభవించడంతో తమ గ్రామం పూర్తిగా గురైందని తాతల ముత్తాతల కాలం నుండి ఇలాంటి వరదలను ఎదుర్కొని అవస్థలు పడుతున్నామని అందుకే స్వాశిత పరిష్కారం కోసం కడేకల్ సమీపంలో గల ఎర్ర బోరు స్థలంలో గుడిసెలు వేసుకున్నామని దళితులు తెలిపారు. ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.