ములుగు : లక్ష్మీనరసింహాస్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. జిల్లాలోని ములుగు మండలం కొత్తూరు గ్రామంలోని దేవుని గుట్టపై హోలీ పర్వదినం సందర్భంగా నిర్వహించిన భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రపంచ ప్రఖ్యాత అంకోర్ వాట్ దేవాలయంతో పోలిన బౌద్ధుల కాలంనాటి ఈ గుడిలో గత కొన్ని సంవత్సరాలుగా కొత్తూరు గ్రామస్తులు హోలీ పండుగ సందర్భంగా జాతర నిర్వహిస్తున్నారు. పిరమిడ్ ఆకారంలో ఉన్న ఈ దేవాలయాన్ని సుమారు 1500 సంవత్సరాల క్రితం ఇసుక రాతి ఇటుకలతో ఒక్కొక్క ఇటుకపై విగ్రహ ఆకారాలు చెక్కి ఇటుక పక్కన ఇటుకలు పేర్చి ఈ దేవాలయాన్ని నిర్మించారు. అందులో లక్ష్మీనరసింహాస్వామి వారిని ప్రతిష్టించిన గ్రామస్తులు ప్రతి సంవత్సరం హోలీ సందర్భంగా వైభవంగా కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement