Friday, November 22, 2024

వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌ల‌లో కెటిఆర్ బిజిబిజి – రూ.1700 కోట్ల అభివృద్ధి ప‌నుల‌కు శ్రీకారం…

వ‌రంగ‌ల్ : రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ‌వ‌రంగ‌ల్ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రాంపూర్ గ్రామంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేసిన మిష‌న్ భ‌గీర‌థ వాట‌ర్ ట్యాంక్‌ను కేటీఆర్ ప్రారంభం చేశారు. ఈ ట్యాంక్ సామ‌ర్థ్యం 8 ల‌క్ష‌ల లీట‌ర్లు. వాట‌ర్ ట్యాంకు అందుబాటులోకి రావ‌డంతో స్థానిక ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. వాట‌ర్ ట్యాంకు ప్రారంభం కంటే ముందు అక్క‌డ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిష‌న్‌ను మంత్రి కేటీఆర్ వీక్షించారు. అనంత‌రం దేశాయి పేటలో 600 వందల రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు చేసిన కేసీఆర్.. ఆ త‌ర్వాత వరంగల్ అర్బన్ దేశ పేటలోని జర్నలిస్టుల కోసం 200 వందల రెండు పడకల ఇండ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. వరంగల్‌ పర్యటనలో భాగంగా మొత్తం రూ.1,700 కోట్లతో చేపట్టిన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. కేటీఆర్ వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌, చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్‌, నన్నపునేని నరేందర్‌, చల్లా ధర్మారెడ్డి, టీ రాజయ్య ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement