నేడు ములుగు జిల్లాలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పర్యటించనున్నారు. 150 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కేటీఆర్ చేయనున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కనే 65 కోట్లతో నిర్మించతలపెట్టిన కలెక్టర్ కార్యాలయ భవన సముదాయం, 38.50 కోట్లతో జిల్లా పోలీసు కార్యాలయ భవనం, 11.40 కోట్లతో మేడారంలో శాశ్వతంగా నిర్మించనున్న భవనాలు, 1.20 కోట్లతో ఆదర్శ బస్టాండుకు, .50 లక్షలతో నిర్మించనున్న సేవాలాల్ భవనానికి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు
అనంతరం ములుగు 2.50 కోట్లతో నిర్మించిన ములుగు పోలీసు స్టేషన్ భవనంతో పాటు జిల్లాలో మొత్తం 12 కోట్లతో వివిధ ప్రాంతాలలో నిర్మించిన ఆదర్శ పోలీసుస్టేషన్ల భవనాలను ములుగు నుంచే ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి రామప్ప చేరుకొని ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం ఇరిగేషన్ డేను పురస్కరించుకొని రామప్ప రిజర్వాయర్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించి గోదావరికి హారతి ఇవ్వనున్నారు. అక్కడి నుంచి నేరుగా ములుగు పంచాయతీ వద్దకు చేరుకొని .కోటితో నిర్మించిన శ్మశాన వాటిక, 2 కోట్లతో నిర్మించిన అంతర్గత సిమెంటు రోడ్లు, జిల్లా రవాణా కార్యాలయాన్ని ప్రారంభింస్తారు. ఆ తర్వాత ములుగు సమీపంలోని సాధన పాఠశాల పక్కన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు