మల్హర్/ భూపాలపల్లి( ప్రభ న్యూస్) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యురు బ్యాంకు చోరీకి దుండగులు భారీ స్కెచ్ వేశారు. ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ అధికారులు స్థానికుల కథనం ప్రకారం… మల్హర్ మండలంలోని కొయ్యూరు తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో చోరీకి గుర్తు తెలియని దుండగులు యత్నించారు. బ్యాంక్ సిబ్బంది మంగళవారం విధులు ముగించుకొని వెళ్లగా బుధవారం ఉగాది పండగ సెలవు కావడంతో గురువారం ఉదయం విధుల్లో భాగంగా బ్యాంక్ ఓపెన్ చేయడానికి వచ్చారు. ఈ క్రమంలో బ్యాంకు గేట్ తాళం పగలగొట్టి, కిటికీ ద్వారా లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఆనవాళ్లు గమనించడంతో వెంటనే అప్రమత్తమైన బ్యాంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
దొంగలించిన సామాగ్రి తోటి దొంగతనానికి యత్నం
ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు దుండగులు భారీ స్కెచ్ వేశారు. కొయ్యూరు లోని ఓ వెల్డింగ్ షాప్ లో గత మంగళవారం సాయంత్రం వెల్డింగ్ చేసే వస్తువులు, గ్యాస్ మొద్దులు దొంగిలించినట్లు తెలుస్తుంది. వాటి తీసుకుని వచ్చి బ్యాంకు గేటును, కట్ చేసి కిటికీలు కట్ చేశారు. కట్ చేస్తున్న క్రమంలో గ్యాస్ లీక్ అవ్వడంతో వాటిని విడిచిపెట్టి పరారయ్యారని తెలుస్తోంది. బ్యాంకు మేనేజర్ అవినాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాటారం సిఐ రంజిత్ రావు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకులో సీసీ కెమెరాలను పరిశీలించారు. భూపాలపల్లి ఫింగర్ ప్రింట్ ఎస్ఐ శ్రీనివాస్ సంఘటనలు చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.
కొయ్యురు బ్యాంక్ దోపిడీకి విఫల యత్నం
Advertisement
తాజా వార్తలు
Advertisement