వరంగల్ : చేప పిల్లలను పెంచే ఆర్ధికస్తోమత లేని మత్యకార్మికులకు వంద శాతం సబ్సిడీ ఇచ్చి వారి కోసం రూ.500 కోట్లు ఖర్చు చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్ లోని 9.12 లక్షల చేప పిల్లలను ఎమ్మెల్సీ బండ ప్రకాష్, జిల్లా కలెక్టర్ గోపితో కలిసి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విడుదల చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో మత్స్యకార్మికుల జీవితాలు ఆధ్వనంగా ఉన్నాయని పేర్కొన్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే వంద శాతం సబ్సిడీ ఇచ్చి ముదిరాజ్ బిడ్డలకే హక్కులు కల్పించామన్నారు. ప్రభుత్వం చాలా సహకారం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్న మత్స్య కార్మికులు సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు. మహిళ మత్స్య కార్మికులు ఇంకా అవగాహనా పెంచుకొని మార్కెటింగ్ లో నైపుణ్యం సాధించాలన్నారు. మైలారంలో మహిళలకు ప్రత్యేక షాప్ కేటాయించుతా.. గతంలో వేరే రాష్ట్రం నుండి చేపలు వచ్చేవి.. కానీ ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం వచ్చాక మన రాష్ట్రం నుండే వేరే ప్రాంతాలకు చేపలను ఎగుమతి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇంకా చాలా అభివృద్ధి జరిగి మత్స్య కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా నిలబడాలని ఈ సందర్బంగా మంత్రి కోరారు.
మత్స్యకారులకు సబ్సిడీ ఇచ్చి రూ.500 కోట్లు ఖర్చు చేసిన ఏకైక సీఎం కేసీఆర్ : మంత్రి ఎర్రబెల్లి
Advertisement
తాజా వార్తలు
Advertisement