గణపురం (ప్రభ న్యూస్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈనెల 11న జయశంకర్ జిల్లా గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్ల ప్రాంగణంలో నిర్వహించే కవి సమ్మేళనాన్ని పండుగలా నిర్వహించాలని అదనపు కలెక్టర్ దివాకర్ అన్నారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో జిల్లా మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 11న సాయంత్రం నిర్వహించే ఈ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని, అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం ఏర్పాట్లను పర్యవేక్షించారు. సమీక్ష సమావేశం అనంతరం ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నరేష్ ఆయనకు తీర్థప్రసాదాలను ఆశీర్వచనాలను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో విజయలక్ష్మి, డిపిఆర్ఓ వి.శ్రీధర్, సిపిఓ సామ్యూల్, డిపిఓ ఆశాలత, మత్స్యశాఖ అధికారి అవినాష్, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ సీఈవో రఘువరన్, జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి సునీత, ఎంపీడీవో అరుంధతి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.