కాకతీయుల ఉనికి, పరిపాలను తెలిపేందుకే కాకతీయ వైభవ సప్తాహం నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్అ న్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం, ఇనుగుర్తి గ్రామంలోని కాకతీయ రాజులు నిర్మించిన ఆలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ నిర్వహకులు, గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. కాకతీయుల కాలంలో నిర్మించిన లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో, రామలింగేశ్వర ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడుతూ…. సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాకతీయుల ఉనికి, పరిపాలను ప్రజలకు తెలిపే విధంగా కాకతీయ వైభవ సప్తాహం ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.
కాకతీయ శిల్పకళా నైపుణ్యానికి దర్పణానికి ఎన్నో ఆలయాలు అద్భుతంగా ఆవిష్కృతమయ్యాయి. కాకతీయ పాలనలో చెరువుల నిర్మాణానికి అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని వినియోగించారన్నారు. కాలను క్రమంలో కొందరి నిర్లక్ష్యం కారణంగా పురాతన ఆలయాలు, చెరువులు కనుమరుగు అయ్యాయి. కేసీఆర్ పాలనలో పురాతన ఆలయాలు, చెరువులకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. కాకతీయుల స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ పేరుతో చెరువులను అద్భుతంగా తీర్చిదిద్ది వ్యవసాయానికి పెద్దపీట వేశారన్నారు. కేసీఆర్ వ్యవసాయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం వల్ల చెరువులు ఎండాకాలం సైతం నిండుకుండను తలపిస్తూ వ్యవసాయ ఆధారిత రైతులకు రెండు పంటలు వేసుకునే విధంగా ఉపయోగపడుతున్నాయన్నారు. ఇనుగుర్తి గ్రామనికి, మండలంగా శుభవార్త త్వరలోనే రాబోతుంది.