Friday, November 8, 2024

ఖిలా వరంగల్ కోటలో కాకతీయ కట్టడాలు అద్భుతం..

వరంగల్ : ఖిలా వరంగల్ లోని కోటను కాకతీయ వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్, మంత్రులు సత్యవతి, శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నరేందర్ సందర్శించారు. వీరికి ఎమ్మెల్యే నరేందర్, స్థానిక ప్రజాప్రతినిధులు డప్పుచప్పులు, కళాకారుల నృత్యాలతో ఘనస్వాగతం ప‌లికారు. క‌ళాకారుల నృత్యాల‌తో కోట‌లో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఖిలా వరంగల్ కోటలో కాకతీయ కట్టడాలను కమల్ చంద్ర భంజ్ దేవ్, మంత్రులు పరిశీలిస్తూ కలియతిరిగారు. ఖిలా వరంగల్ కోటలో కాక‌తీయ క‌ట్ట‌డాలు అద్భుతంగా ఉన్నాయ‌ని వారు కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement