Friday, November 22, 2024

WGL | పోలీసుస్టేషన్​ స్థాయిలోనే బాధితులకు న్యాయం జరగాలి: సీపీ రంగనాథ్

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు స్టేషన్ స్థాయి లోనే న్యాయం జ‌ర‌గాల‌ని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగ‌నాథ్‌ అధికారులకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఇవ్వాల (శుక్ర‌వారం) హాఫ్ ఇయ‌ర్లీ క్రైమ్ రివ్యూ జ‌రిగింది. ఈ స‌మావేశంలో సీపీ రంగ‌నాథ్ మాట్లాడారు. పోలీస్ అధికారులు తీసుకునే ప్రతి చర్య బాధితులకు న్యాయం కలిగించేలా ఉండాలన్నారు.

పారదర్శకంగా పనిచేస్తూ, బాధ్యతతో విధులు నిర్వర్తించాల‌ని చెప్పారు. ప్రతికేసులో అధికారుల పనితీరును సమీక్ష చేస్తాన‌ని, తప్పు చేస్తే చర్యలు తప్పవని హెచ్చ‌రించారు. భూ తగాదా కేసులో ఎస్.ఓ.పి. అనుసరించాలి, హద్దులు దాటి ప్రవర్తించవద్దని, తప్పుడు కేసులు నమోదు చేయద్దని సూచించారు. ఈ స‌మావేశంలో డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్ట‌ర్లు, ఆర్ఐ లు, సబ్ ఇన్‌స్పెక్ట‌ర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement