Tuesday, November 26, 2024

జూనియ‌ర్ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి సోని అంత్య‌క్రియ‌లు.. హాజ‌రైన జెపిఎస్ లు

ఉద్యోగ భద్రత కోసం ఉద్యమిస్తూ హక్కుల సాధనకై అసువులు బాసిన బైరీ సోనికి ఇవే మా నివాళులు అనే నినాదాలు నర్సంపేట పట్టణంలో మారుమోగుతున్నాయి.నిన్న ఆత్మహత్య చేసుకున్న రంగాపురం జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోని అంత్యక్రియలు నర్సంపేట పట్టణంలో పోలీసుల సమక్షంలో ప్రారంభమయ్యాయి.భారీ సంఖ్యలో హాజరైన జె.పి.ఎస్.లు వీ వాంట్ జస్టిస్ అనే నినాదాలతో సోని అంత్యక్రియల్లో పాల్గొన్నారు.జిల్లాలోని పోలీసు సిబ్బంది అంతా హాజరై సోని అంత్యక్రియ ఘట్టాన్ని జరిపిస్తున్న పరిస్థితి.సోని కుటుంబానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement