కొత్తగూడ, (ప్రభ న్యూస్): దీర్ఘకాలం పాటు విప్లవోద్యమంలో, రైతు పోరాటాలలో ముందున్నటువంటి వ్యక్తి, దున్నేవాడిదే భూమి కావాలని సాగిన విప్లవోద్యమంలో ఎర్రజండాను తన గుండెకి హత్తుకొని, కట్టుకున్న కామ్రేడ్ దనసరి లచ్చయ్య గురువారం తన స్వగ్రామం అయిన కొత్తగూడ మండలంలోని ఎంచగూడ గ్రామంలో తుది శ్వాస విడిచారు. ఆయనను స్మరించుకుంటూ ఎంచగూడ ప్రాంతంలో అమరుడు కామ్రేడ్ పాలడుగు కృష్ణ అడుగుజాడల్లో నడుస్తూ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ కృషి చేసిన వాడిని, పీడిత ప్రజల కోసం విప్లవోద్యమానికి తన కొడుకైన కామ్రేడ్ గోపన్నను అంకితం ఇచ్చిన గొప్ప త్యాగధనుడని, ఈ ప్రాంతంలో పోడు భూముల పోరాటంలో ముందు నడిచిన వాడని, ఈ దోపిడీ వ్యవస్థను మార్చాలని, నూతనమైన దోపిడీ లేని సమాజం ఏర్పడాలని జరిగిన పోరాటంలో తన వంతు పాత్రను పోషించాడని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోవర్ధన్ అన్నారు.
వారు చేసిన కృషిని ఎల్లప్పుడు స్మరించుకోవాలని, కామ్రేడ్ దినసరి లచ్చయ్య మరణం ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీరని లోటన్నారు. సిద్ధాంతం, ఆచరణ, కార్యాచరణ కలిసున్న ఆదర్శ కమ్యూనిస్టు కామ్రేడ్ దనసరి లచ్చయ్య అని అన్నారు. దోపిడీ, పీడన లేని సమ సమాజాన్ని కలలుగన్న లచ్చయ్య ఆశయాల వెలుగులో ముందుకు వెళతామన్నారు. అదే కామ్రేడ్ లచ్చయ్య త్యాగాల అడుగుజాడల్లో పయనించడమే వారికిచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కామ్రేడ్ మోకాళ్ళ మురళీకృష్ణ, ఎ.ఐ.కె.ఎం.ఎస్. రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ సత్యనారాయణ, మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి రామచంద్రయ్య, పి.ఓ.డబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ఊకే పద్మ, పార్టీ వరంగల్ జిల్లా నాయకులు కామ్రేడ్ నున్నా అప్పారావ్,పి.వై.ఎల్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎలకంటి రాజేందర్, పి.డి.ఎస్.యు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ విజయ్ ఖన్నా, ఎ.ఐ.కె.ఎం.ఎస్. జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ గుజ్జు దేవేందర్, పి.డి.ఎస్.యు. మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ శ్రీశైలం, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ మాదంశెట్టి నాగేశ్వర్ రావు, పార్టీ వరంగల్ జిల్లా నాయకులు కామ్రేడ్ బండి కోటేశ్వర రావు, అరుణోదయ మహబూబాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కామ్రేడ్ తారాచంద్, కామ్రేడ్ చారీ హరీష్, పి.డి.ఎస్.యు. రాష్ట్ర నాయకులు మధు, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital