Friday, November 22, 2024

జ‌న‌గామ కాంగ్రెస్ లో మంట‌లు.. జంగా తొల‌గింపుకై డీసీసీ రిక‌మండేష‌న్‌..

కాజీపేట : జంగా రాఘవరెడ్డి ప్రాథమిక సభ్యత్వాన్ని తొలగిస్తున్నామని నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా లోని విలేకరుల సమావేశంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాఘవరెడ్డి ఇష్టమొచ్చినట్లుగా మీడియా సమావేశాలలో మాట్లాడుతున్నారని పై అధిష్టానానికి సమాచారం ఇవ్వడం జరిగింద‌ని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఇతర పార్టీలకు మేలు చేసే విధంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న జంగా రాఘవరెడ్డి ప్రాథమిక సభ్యత్వాన్ని తొలగిస్తున్నట్లు ఆయ‌న ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement