జనగామ జిల్లా:: మెడికల్ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఇది 100% లవ్ జిహాది హత్య నే అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి ఆరోపించారు. కొడకండ్ల మండలం గిర్నిగడ్డ తండాలో డాక్టర్ ప్రీతి పార్థివ దేహానికి పూలమాలవేసి ఆయన నివాళువర్పించారు.ఆమెకు ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం జంగా మీడియాతో మాట్లాడుతూ రైల్వే ఏఎస్ఐ ధరావత్ నరేందర్ కుమార్తె ప్రీతి ర్యాగింగ్ భూతానికి బలైందన్నారు.గిరిజన బిడ్డ మరణం బాధాకరం అన్నారు… విద్యార్థి మెడికల్ పీజీ స్థాయికి రావాలంటే ఆ తల్లిదండ్రులు, ఆ ఎన్నెన్ని త్యాగాలు చేశారో అర్థం చేసుకోవాలన్నారు. ప్రీతి మనందరినీ వదిలి పెట్టి పోవడానికి కారణమైన ఎంతటి వారైనా వదిలి పెట్ట వద్దన్నారు.ర్యాగింగ్ కు పాల్పడిన సైఫ్ తోవాటు,కాలేజీ ప్రిన్సిపాల్, HOD ల నిర్లక్ష్యం భవిష్యత్తు డాక్టర్ ను కోల్పోయేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీతి మరణం మనమంతా సిగ్గుపడేలా చేసింది అన్నారు.
అమ్మాయిలను వేదించే వారి పట్ల కఠినంగా ఉండాలన్నారు. ప్రిన్సిపల్, HOD ల నిర్లక్ష్యం క్షమించరానిదను, వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇంకో ఆడబిడ్డ పట్ల ఇలాంటి నిర్లక్ష్యం చూపకుండా చూడాలన్నారు. ప్రీతి మరణం పట్ల ప్రగాఢ సంతాపం, సానుభూతి వ్యక్తం చేశారు.
ప్రీతి కుటుంబానికి రూ.5 కోట్ల సహాయం చేయాలి
సీనియర్ వేధింపులకు బలైన భవిష్యత్తు డాక్టర్ ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం రూ.ఐదు కోట్ల ఎక్స్గ్రేషియా చెల్లించి భరోసా కల్పించాలని జంగా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా పేరుతో ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఈనెల 22 తారీకు రోజున డాక్టర్ ప్రీతి హానికరమైన ఇంజక్షన్ తీసుకొని చనిపోయిన కూడా అధికారికంగా ప్రకటించకుండా పాలకుర్తి నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న గిరిజనుల ఓట్లు కాజేయడం కోసం సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమాలతో ఈ నెల 26వ తేదీ ఉదయం ప్రోగ్రాంలో ముగిసిన తర్వాత రాత్రి ప్రీతి చనిపోయినట్లు ప్రకటన చేశారన్నారు. మంత్రి కార్యక్రమాల కోసం ఆమె చావును సైతం అడ్డం పెట్టుకున్నారని ఘాటుగా విమర్శించారు.ప్రీతి మృతదేహం సొంత గ్రామమైన గిర్ని తండాకు వచ్చి గంటలు గడిచిపోతున్న సొంత నియోజకవర్గమైనప్పటికీ మంత్రి దయాకర్ రావు పరామర్శించేందుకు రాకపోవడం సిగ్గుచేటు అన్నారు. గిరిజన మంత్రులు మరియు నియోజకవర్గ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు తక్షణమే రాజీనామా చేయాలి డిమాండ్ చేశారు.
ప్రీతి కుటుంబంలో ఒకరికి గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వడంతో పాటు హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్ లో సొంత ఇల్లు నిర్మాణం చేసి ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రీతి హత్య విషయం లో నిజా నిజాలు నెగ్గు తేల్చేందుకు సిట్టింగ్ జడ్జితో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి పది రోజుల్లో తేల్చాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు తప్పవని హెచ్చరించారు….