Saturday, November 23, 2024

వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి : మంత్రి ఎర్రబెల్లి

వినాయక నిమజ్జనాలు అత్యంత ప్రశాంతంగా జరిగేట్లు చూడాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలేని జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. వినాయక మండపాల బాధ్యులకు ముందుగానే తగు సూచనలు చేయాలని అధికారులను పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. వరంగల్ మహానగరం లో జరగనున్న వినాయక నిమజ్జనాలు, ఈ నెల 16,17,18 తేదీల్లో జరగనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల కార్యక్రమాల నిర్వహణపై హనుమకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వరంగల్ ప్రశాంతతకు మారుపేరు. ఆ పేరు నిలబెట్టండి. దారి మళ్లింపు, నిమజ్జన ప్రాంతాలు, పార్కింగ్ స్థలాలు, ప్రజలు పాటించాల్సిన ట్రాఫిక్ నిబంధనలపై ముందే ప్రజలకు పూర్తి స్థయిలో అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు.అలాగే ఈనెల 16, 17, 18 తేదీలలో నిర్వహించే తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాల కార్యక్రమాల విజయవంతానికి కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశానుసారం తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాల కార్యక్రమాలు సమన్వయంతో ఘనంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, వరంగల్ మేయర్‌ గుండు సుధారాణి, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్ సుందర్ రాజ్, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, గోపి కూడా వైస్ చైర్మన్ వరంగల్ కమిషనర్ ప్రావీణ్య, సీపీ రుణ్ జోషి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement