పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడే బాధ్యత నాపై ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం మండలంలోని రామరాజుపల్లి నిర్మల సింగరాజుపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. రామరాజపల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్మల గ్రామంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి అధిక సంఖ్యలో మంత్రి సమక్షంలో గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… టిఆర్ఎస్ పార్టీ ప్రజలపార్టీ అన్నారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడే బాధ్యత తనపై ఉందన్నారు. అనంతరం సింగరాజుపల్లిలో ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభించి అనంతరం మన్నెందొర అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అలాగే సింగరాజుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన 40 బెడరూమ్ ఇండ్లను మంత్రి దయాకర్ రావు జిల్లా కలెక్టర్ శివలింగయ్య చేతులమీదుగా నూతన గృహలు ప్రారంభించారు. మంత్రికి లబ్ధిదారులు, మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో లబ్ధిదారులు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ దయ మంత్రి దయన్న వల్ల ఇప్పుడు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారని లబ్ధిదారులు సభలో తెలిపారు. దుర్గమ్మ పండగ లోపే డబుల్ బెడ్ రూములు ఇండ్లు వచ్చిందని, గ్రామంలో దుర్గమ్మ పండుగ మాకు నిజమైన పండుగ అన్నారు. ఇన్నిరోజులు ఇండ్లల్లో ఉన్నామని, ఈరోజు నుండి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి దయన్నకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ… కేసీఆర్ కృషి ఫలితమే ఈరోజు ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తెలంగాణ మహిళ ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్నాయన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర అధోగతి పాలు అయింది ఇన్నేళ్లలో మంచినీళ్లు కూడా ఇవ్వలేదన్నారు. ఇపుడు మాట్లాడుతున్న కాంగ్రెస్ వాళ్లకు తగిన గుణపాఠం చెప్పండన్నారు. సాగునీళ్లు చెరువుకు నింపిన ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. కాంగ్రెస్, బీజేపీలు దొందూ దొందేనన్నారు బిజెపి పార్టీ నేతలు మాటలు పచ్చి అబద్ధాలను నమ్మవద్దంటూ కార్యకర్తలకు సూచించారు.
కాంగ్రెస్ హయాంలో పొన్నాల లక్ష్మయ్య ఇరిగేషన్ మంత్రిగా ఉండి డ్యామ్ లు కట్టలేదని, దేవరుప్పుల మండలాన్ని ఏమీ అభివృద్ధి చేయలేదన్నారు. సీఎం మూడేళ్లలో ప్రతి కుటుంబానికి 10 లక్షలు దళితబంధు ఇచ్చేవిధంగా పథకాన్ని రూపొందించారన్నారు. మన ఊరు – మన బడిలో సిoగరాజుపెళ్లి పాఠశాలకు ప్రహరీగోడ టాయిలెట్ అదనపు గదులకు మొత్తం 50 లక్షలు ఖర్చు చేస్తున్నామని, ప్రతిఒక్కరు సర్కార్ బడికి విద్యార్థులను పంపాలన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పే కాంగ్రెస్, బీజేపీ నాయకులను నమ్మకూడదని అన్నారు. జిల్లా కలెక్టర్ శివలింగయ్య మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ పేద, బడుగు వర్గాలకు ఇల్లు ఇవ్వడంతో జీవితం మీద భరోసా వస్తుందన్నారు. ఏజిల్లాలో లేనివిధంగా 4230 మంజూరు కాగా.. పాలకుర్తి నియోజకవర్గంలో రెండు వేల ఇళ్లు ఇచ్చామన్నారు. డబల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లేశం, అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు, జడ్పిటిసి ఓ విజయలక్ష్మి, ఎంపీపీ సావిత్రి మల్లేశం, జెడ్ పి టి సి చల్ల భార్గవి సుందరం రెడ్డి, వైస్ ఎంపిపి విజయ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్, రవి, రామరాజుపల్లి సర్పంచ్ బండి స్నేహం నరసింహ, నిర్మల సర్పంచ్ శ్రీనివాస్, పిఎసిఎస్ డైరెక్టర్ కొత్త జలంధర్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు మేడ విద్యాసాగర్, ఎంపీటీసీ మేడం కళ్యాణ్, వెంకటేష్,
తదితరులు పాల్గొన్నారు.
పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడే బాధ్యత నాది : మంత్రి ఎర్రబెల్లి
Advertisement
తాజా వార్తలు
Advertisement