Monday, October 14, 2024

WGL: మెడికల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి..

చిట్యాల, ఆగస్టు 20 (ప్రభ న్యూస్): తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంగళవారం జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రెటరీ కట్కూరి నరేందర్ మాట్లాడుతూ… సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న వసీంఖాన్ అనే ఉద్యోగి ఆదివారం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ఆయన మృతికి నివాళులర్పించారు.

గత మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారమై ఆత్మహత్య చేసుకున్నాడని ప్రభుత్వం కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న చిరు ఉద్యోగులకు ప్రతి నెలా ఐదులోపు జీతాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలని, ఇలాంటి చావులకు తావు ఇవ్వకుండా ఉద్యోగుల జీతాలు ప్రతినెలా క్రమం తప్పకుండా ఇవ్వాలని నరేందర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వివేక్, హెడ్ నర్సు విజయకుమారి, రాష్ట్ర కార్యదర్శి కిషోర్, కవిత, రాజమౌళి, కృష్ణ, స్వామి, రమణ, కోమల, రాజేష్, రాజన్న, స్టాఫ్ నర్సులు, హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement