వాజేడు, ఏప్రిల్ 23 ప్రభ న్యూస్ : రాష్ట్ర సరిహద్దు ధాన్యం కొనుగోలు కేంద్రంను జిల్లా మేనేజర్, జిల్లా పౌర సరఫరాల అధికారి బి.రాంపతి తనిఖీ చేశారు. వాజేడు మండలంలోని చెరుకూరు గ్రామం వద్ద ఏర్పాటు చేసిన రాష్ట్ర సరిహద్దు ధాన్యం కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బందికి ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వరి ధాన్యాన్ని నియంత్రించుటకు పలు సూచనలు జారీ చేశారు.
ఆ వాహనాలకు సంబంధించిన పత్రాలను పూర్తిగా పరిశీలించి ఆ విషయాలను రిజిస్టర్ లో నమోదు చేసి, సందేహం ఉన్న వాహనాలపై చర్యలు తీసుకోవటం కోసం సంబంధిత అధికారుల దృష్టిలో ఉంచాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రజా పంపిణీ బియ్యం తరలించే వాహనాలను తనిఖీ చేసి సంబంధిత అధికారులకు చర్యలు తీసుకొనుటకై తెలియజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాంచందర్ డిప్యూటీ తహసీల్దార్, తదితరులు ఉన్నారు.
- Advertisement -