Friday, November 22, 2024

కాంగ్రెస్, బీజేపీ పాలనలో రైతులకు అన్యాయం : మంత్రి ఎర్రబెల్లి

బీజేపీ ప్రభుత్వం మార్కెట్ లను రద్దు చేయాలని చూస్తుంది, కాంగ్రెస్, బీజేపీ పాలనలో రైతులకు అన్యాయం జ‌రిగింద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎం.పి పసునూరి దాయకర్, ఎమ్మెల్యే అరూరి రమేష్, డిసిసిబి చైర్మన్ మర్నేని రవీందర్ రావులు హాజర‌య్యారు. ఇల్లంద మార్కెట్ కమిటీ చైర్మన్ గా కమ్మగాని స్వామి రాయుడు ప్రమాణం చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.

మంచి అవకాశం… సద్వినియోగం చేసుకోవాల‌న్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కోసం ఎంతో మంది పని చేశారు కానీ, అందరికీ ఏదో విధంగా వారికి గుర్తింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి వారికి గుర్తింపు వచ్చే విధంగా చేస్తామ‌న్నారు. మార్కెట్ కోసం కొత్త కమిటీ పని చేయాల‌న్నారు. రైతుల కోసం ఎన్ని విధాల సహాయం కావాలంటే అన్ని విధాలా చేయూతనిస్తాన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వంలో రైతులకు ఏం జరిగిందో ప్రజలు ఆలోచించాల‌న్నారు. రైతుల కోసం పని చేసిన నాయకులు ఇద్దరే ఇద్దరు. ఒకరు ఎన్టీఆర్,ఇంకొకరు కేసీఆర్ అన్నారు. ఎన్టీఆర్ రైతులకు కోసం రకాలు మాఫీ చేసి మహిళలకు రుణాలు, రూ. 2కే కిలో బియ్యం అందించారు. ఇప్పుడు కేసీఆర్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. దేశంలో రాష్ట్రం మొత్తానికి తాగు, సాగు నీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.


కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నామ‌న్నారు. కాంగ్రెస్, బిజెపి పాలిత ప్రాంతాల్లో ఇలాంటి పాలన ఉందా? , అక్కడ చేతకాని చవటలు… ఇక్కడ వ్యతిరేకిస్తున్నారు. దేశ వ్యాప్తంగా రైతులు కేసీఆర్ నాయకత్వం ఉండాలని కోరుకుంటున్నారు. బిజెపి పార్టీ మతతత్వ పార్టీ అన్నాడు. బిజెపి పాలిత ప్రాంతాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారా? చెప్పాలి అన్నారు. రైతులకు మీటర్లు పెట్టాలని మోడీ చూస్తున్నారు కాని కేసీఆర్ ఒప్పుకోలేదన్నారు. మార్కెట్ల‌ను ర‌ద్దు చేయాల‌ని బీజేపీ ప్ర‌భుత్వం చూస్తుంద‌ని , రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన నల్ల చట్టాలలో అదే ఉంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement