Friday, September 13, 2024

Bhupalapalli: ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి: జయశంకర్ జిల్లాలో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి ప్రత్యేక అధికారి హోదాలో జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా అధికారులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు.

ప్రజా పాలన అందిస్తున్న ప్రభుత్వం…
జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్య అతిథి పోదెం వీరయ్య
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పోదెం వీరయ్య అన్నారు. జయశంకర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పోదెం వీరయ్య పాల్గొని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరేలతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు.

సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు. అదే విధంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సింగరేణిలో జీఎం హాబిబ్ హుస్సేన్ , జెన్ కో లో సీఈ సిద్దయ్య జాతీయ పతాకం ఆవిష్కరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement