వరంగల్, గ్రేటర్ ఎన్నికల్లో ఆఖరి రోజు ఆదివారం నామినేషన్లు వెల్లువెత్తాయి. గ్రేటర్లోని 66 డివిజన్లకు 1,214 మంది అభ్యర్థులు 1,753 నామినేషన్ సెట్లు దాఖలు చేశారు. చివరి రోజు వివిధ పార్టీల నుంచి 1,010మంది అభ్యర్థులు 1,487 నామినేషన్ సెట్లు వేశారు. 66 డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ నుంచి అధిక సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. తర్వాత బీజేపీ నుంచి దాఖలు చేశారు. తాజా మాజీ కార్పొరేటర్లలో సగం మంది నామినేషన్లు వేయలేదు. రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో వారి కుటుంబసభ్యులతో నామినేషన్ వేయించారు. టీఆర్ఎస్ నుంచి అధిక సం ఖ్యలో 706 సెట్లు, బీజేపీ నుంచి 294, కాంగ్రెస్ నుంచి 247, టీడీపీ నుంచి 21, సీపీఐఎం 14, సీపీఐ 7, ఇతర పార్టీల నుంచి 45, స్వతంత్ర అభ్యర్థులు 419 సెట్లు దాఖలు చేశారు. నేడు నామినేషన్ల పరిశీలన కార్యక్రమం నిర్వహించనున్నారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement