Thursday, November 21, 2024

TS: మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి ఎదుట హై టెన్షన్ వాతావరణం..

వడ్డేపల్లి (వరంగల్) : బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీకి రాజీనామా చేయొద్దంటూ మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, బసవరాజ్ సారయ్య బుజ్జగించారు. బుధవారం ప్రశాంత్ నగర్ లోని ఆయన నివాసంలో పార్టీకి రాజీనామా చేస్తానని ఆరూరి రమేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సారయ్య, తెలంగాణ రాష్ట్ర రైతు రుణ కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు, కూడా మాజీ చైర్మన్ మరీ యాదవ రెడ్డి, సుందర్ రాజ్ యాదవులు ఆయన నివాసానికి చేరుకొని పార్టీని వీడొద్దంటూ ప్రాధేయ‌పడ్డారు. కార్యకర్తల నినాదాలతో ప్రశాంత్ నగర్ లో ఆయన ఇంటివద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రులు ఆరూరి రమేష్ ను బలవంతంగా వాహనంలో తీసుకెళ్లారు. అయితే వారి వాహనానికి కార్యకర్తలు అడ్డుతిరిగి వెళ్లొద్దంటూ బ్రతిమలాడారు. రమేష్ కారు దిగివచ్చి కార్యకర్తలకు నచ్చజెప్పి వాహనంలో వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement