Thursday, November 7, 2024

పెంబర్తిలో బ‌య‌ట‌పడ్డ కాక‌తీయుల కాలం నాటి లంకె బిందె..

జ‌న‌గామ జిల్లాలోని పెంబ‌ర్తిలో ఇంటి కోసం పునాది తవ్వుతుండ‌గా కాక‌తీయుల కాలం నాటి లంకె బింకె బ‌య‌ట‌ప‌డింది.. ఇందులో 18 తులాల బంగారు ఆభ‌ర‌ణాలు, రెండు కిలోల‌కు పైగా వెండి ఉన్నాయి. వివ‌రాల‌ల‌లోకి వెళితే, హైద‌రాబాద్ కు చెందిన న‌ర్శింహ పెంబ‌ర్తీలో వ్య‌వ‌సాయ భూమిని ఇటీవ‌లే కొనుగోలు చేశారు.. ఇక్క‌డే ఇంటి నిర్మాణ కోసం భూమి చ‌దును చేస్తుండ‌గా లంకె బిందె బ‌య‌ట‌ప‌డింది.. దానిని ప‌గుల‌గొట్టి చూడ‌గా, బంగారు ఆభ‌ర‌ణాలు, వెండి వ‌స్తువులు క‌నిపించాయి. వెంట‌నే న‌ర్శింహ ఈ విష‌యాన్నిరెవిన్యూ అధికారుల‌కు, పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చాడు.. వారు వ‌చ్చి లంకె బిందెను స్వాధీనం చేసుకున్నారు.. ఈ లంకె బిందె కాక‌తీయుల కాలం నాటిద‌ని అధికారులు అంటున్నారు.. కాగా, త‌న భూమిలో బ‌య‌ట‌ప‌డిన లంకె బిందె, అందులోని వ‌స్తువులు త‌న‌కే చెందుతాయ‌ని న‌ర్శింహ అంటున్నాడు.. అయితే దీనిపై జిల్లా యంత్రాంగం ఒక నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని రెవిన్యూ అధికారి ఒక‌రు చెప్పారు. సంఘటన స్థలాన్ని జనగామ జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, ఏ ఎస్ పి వినోద్ కుమార్ , తహసీల్దార్ రవీందర్ ,ఎస్ ఐ రవి కుమార్ తదితరులు సందర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement