Saturday, November 23, 2024

వ‌రంగ‌ల్ లో భారీ వ‌ర్షం..

వరంగల్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో వాన దంచికొట్టింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు కుండపోతగా వర్షం కురవడంతో రెండు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరంగల్‌ పట్టణంతోపాటు జిల్లా అంతటా భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని సాయిగణేశ్‌నగర్‌, ఎస్సార్‌నగర్‌, గరీబ్‌నగర్‌లో రోడ్లపైకి వరద నీరు చేసింది. ఇక హంటర్‌రోడ్డులోని ఎన్టీఆర్‌ నగర్‌ జలదిగ్బంధంలో చిక్కుకున్నది.

జిల్లాలో అత్యధికంగా వరంగల్‌ మండలంలో 14 సెంటీమీటర్ల వాన కురిసింది. నల్లబెల్లి మండలంలో 5.8 సెంటీమీటర్లు, దుగ్గొండిలో 5, రాయపర్తిలో 4.1, గీసుకొండలో 3.2, ఖానాపూర్‌లో 2.3 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ఇక మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. కురవి మండలంలో రాత్రి కురిసిన వానతో నేరడ శివారు రాయినిపట్నం వద్ద లోలెవల్ బ్రిడ్జీపై నుంచి ప్రవహిస్తున్న వరద నీరు ప్రవహిస్తున్నది. కురవి మండలంలో 8.4 సెంటీమీటర్లు, బయ్యారంలో 8.2, కొత్తగూడెంలో 4.8, మహబూబాబాద్‌లో 4.6, నెల్లికుదూర్‌లో 4.5, మర్రిపెడలో 3.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement